Share News

సీఎం సభను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Feb 23 , 2025 | 11:29 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ది ప్రచారంలో భాగంగా నేడు మంచిర్యాలకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారని, అధిక సంఖ్యలో పట్టభద్రులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొ ని విజయవంతం చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసా గర్‌రావు అన్నారు.

సీఎం సభను విజయవంతం  చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాల క్రైం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి) : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ది ప్రచారంలో భాగంగా నేడు మంచిర్యాలకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారని, అధిక సంఖ్యలో పట్టభద్రులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొ ని విజయవంతం చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసా గర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 16500 మంది పట్టభద్రుల ఓటర్లు మంచిర్యాల నియోజకవర్గంలో ఉ న్నారన్నారు. మేధావులు, విద్యావంతులు తమ ఓటు హక్కును విని యోగించుకొని కాంగ్రెస్‌ బలపర్చిన నరేందర్‌రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తా మని ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే వాటిని కూడా నెవరేరుస్తా మన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బస్తాకు రెండు కిలోలు తేమ పే రుతో రైతులను దోచుకుందని మండిపడ్డారు. రైతులను మోసం చేసిన వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారన్నారు. నస్పూర్‌లో ఏర్పాటు చేసే రేవంత్‌రెడ్డి సభకు పట్టభద్రులు సుమారు 12 వేలకు పైగా హాజరవు తారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ది నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులకు, ప్రభుత్వానికి వారధిగా పని చేస్తానన్నారు. పట్టభద్రుల సమస్యల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పట్టణ అద్యక్షుడు తూముల నరేష్‌, పూదరి తిరుపతి, పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 11:29 PM