Pending Salaries: మహిళా శక్తి ఉద్యోగులకు పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:30 AM
మహిళా శక్తి కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తెలంగాణ మానవ హక్కుల కమిషన్(టీజీహెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది.
ప్రభుత్వానికి మానవ హక్కుల కమిషన్ ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): మహిళా శక్తి కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తెలంగాణ మానవ హక్కుల కమిషన్(టీజీహెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది. ఈ మేరకు టీజీహెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ పేరిట ఓ ప్రకటన విడుదలైంది.
మహిళా శక్తి కేంద్రాల్లో పనిచేస్తున్న సోషల్ కౌన్సిలర్లు, లీగల్ కౌన్సిలర్లు, పోలీసు కానిస్టేబుళ్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు నిరాకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవనోపాధి హక్కును ఉల్లంఘిస్తుందని కమిషన్ పేర్కొంది. వెంటనే జీతాలు చెల్లించి, రెండు నెలల్లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.