Share News

TGEAPCET: ఎప్‌సెట్‌ ధ్రువపత్రాల పరిశీలన షురూ

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:04 AM

ఎప్‌సెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది.

TGEAPCET: ఎప్‌సెట్‌ ధ్రువపత్రాల పరిశీలన షురూ

హైదరాబాద్‌/సిటీ, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఎప్‌సెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. ధ్రువపత్రాల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 36 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆయా సహాయక కేంద్రాల్లో తొలి రోజు 10,602 మంది అభ్యర్థులకు ధ్రువపత్రాలు పరిశీలన పూర్తయిందని తెలిపారు. వెరిఫికేషన్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 6 నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియలో పాల్గొనవచ్చని ఎప్‌సెట్‌ కన్వీనర్‌ శ్రీ దేవసేన సూచించారు.

Updated Date - Jul 02 , 2025 | 04:04 AM