Share News

Slot Booking: రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌ పద్ధతి

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:14 AM

ప్రజలకు పారదర్శక, అవినీతిరహితంగా మరింత మెరుగైన సేవలను సమర్థవంతంగా అందించేందుకుగాను సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌తోపాటు బయోమెట్రిక్‌ విధానాన్ని తీసుకురాబోతున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Slot Booking: రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌ పద్ధతి

  • ఈ విధానంతో 10-15 నిమిషాల్లోనే పూర్తి కానున్న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

  • ఏప్రిల్‌లో కొన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌ షురూ

  • నిషేధిత జాబితాలోని గజం స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసినా కఠిన చర్యలు

  • రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు పారదర్శక, అవినీతిరహితంగా మరింత మెరుగైన సేవలను సమర్థవంతంగా అందించేందుకుగాను సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌తోపాటు బయోమెట్రిక్‌ విధానాన్ని తీసుకురాబోతున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఒక డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు కనీసం 45 నిమిషాల నుంచి గంటకుపైగా సమయం పడుతోందని, స్లాట్‌ బుకింగ్‌ విధానం ద్వారా 10-15 నిమిషాల్లోనే రిజిరేస్టషన్‌ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ విధానాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఏప్రిల్‌ మొదటి వారంలో కొన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌లోనే స్లాట్‌ బుక్‌ చేసుకుని ఆ సమయానికే కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. సోమవారం సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో స్టాంపులు, రిజిరేస్టషన్ల శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్‌, సీసీఎల్‌ఎ కార్యదర్శి మంధా మకరంద్‌, ఐటీ కార్యదర్శి బావేష్‌, ఆరు జోన్ల డీఐజీలు, ఉమ్మడి జిల్లాల జిల్లా రిజిస్ర్టార్లు పాల్గొన్నారు. డాక్యుమెంట్‌ రిజిస్ర్టేషన్‌ కోసం నిరీక్షించాల్సిన అవసరంలేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలను ఆధునికీకరిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), చాట్‌ బోట్స్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. స్లాట్‌ బుకింగ్‌ విధానం దృష్ట్యా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలను పునర్‌వ్యవస్థీకరణ చేయాలని అధికారులకు సూచించారు. ఇక నిషేధిత జాబితాలోని ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్‌ రిజిస్ర్టార్లు రిజిరేస్టషన్‌ చేయకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, భూ భారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను తెచ్చి నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరచి రెవెన్యూశాఖకు అనుసంధానం చేయాలని సూచించారు. నిషేధిత జాబితాలోని గజం స్థలాన్ని రిజిరేస్టషన్‌ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత జాబితాలోని గజం భూమిని రిజిరేస్టషన్‌ చేసిన క్షణంలోనే తన కార్యాలయంతోపాటు స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ కార్యాలయంలో ప్రదర్శితమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.


ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి

లక్షలాది కుటుంబాలకు మేలు చేసే ఎల్‌ ఆర్‌ఎస్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. జిల్లా రిజిస్ర్టార్లు ప్రతి రోజు దీనిపై సమీక్షించాలని, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై ఏమైనా సందేహాలుంటే సబ్‌ రిజిస్ర్టార్లు ఉన్నతాధికారులతో మాట్లాడి వాటిని నివృత్తి చేసుకొని సమస్యను పరిష్కరించాలే తప్ప దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకూడదన్నారు. జిల్లా సబ్‌ రిజిస్ర్టార్లు కార్యాలయాలకే పరిమితంకాకుండా ప్రతివారం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలను సందర్శించాలని ఆదేశించారు.

Updated Date - Mar 18 , 2025 | 04:14 AM