Share News

Hyderabad: ఈ నెల 27న జీపీవో ఎంపిక పరీక్ష

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:37 AM

గ్రామపాలనాధికారుల(జీపీవో) ఎంపికకు సంబంధించి ఈ నెల 27న మరోసారి పరీక్ష నిర్వహిస్తామని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ తెలిపారు.

Hyderabad: ఈ నెల 27న జీపీవో ఎంపిక పరీక్ష

గ్రామపాలనాధికారుల(జీపీవో) ఎంపికకు సంబంధించి ఈ నెల 27న మరోసారి పరీక్ష నిర్వహిస్తామని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ తెలిపారు. మాజీ వీఆర్‌వో, వీఆర్‌ఏలకు గ్రామపాలనాధికారులుగా అవకాశం కల్పించేందుకు గతంలో ఒకసారి పరీక్ష నిర్వహించారు. ఆ సమయంలో కేవలం 3450 మంది మాత్రమే ఎంపికయ్యారు. దీంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న మాజీ వీఆర్‌వో, వీఆర్‌ఏలు ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సీసీఎల్‌ఏ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ సూచించారు.

Updated Date - Jul 11 , 2025 | 04:37 AM