Share News

4 పంటలకు మద్దతు ధర పెంచండి

ABN , Publish Date - Jun 21 , 2025 | 03:17 AM

యాసంగి సీజన్‌లో(2025- 26) శనగ, గోధుమ, తెల్లకుసుమ, ఆవాల పంటల ఉత్పత్తి వ్యయాన్ని సాగు ఖర్చుల ఆధారంగా అంచనా వేసి కనీస మద్దతు ధర నిర్ణయించాలని వ్యవసాయ ధరల నిర్ణయక కమిషన్‌(సీఏసీపీ)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

4 పంటలకు మద్దతు ధర పెంచండి

  • సీఏసీపీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు

యాసంగి సీజన్‌లో(2025- 26) శనగ, గోధుమ, తెల్లకుసుమ, ఆవాల పంటల ఉత్పత్తి వ్యయాన్ని సాగు ఖర్చుల ఆధారంగా అంచనా వేసి కనీస మద్దతు ధర నిర్ణయించాలని వ్యవసాయ ధరల నిర్ణయక కమిషన్‌(సీఏసీపీ)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. క్వింటాల్‌ శనగలకు రూ. 8,240, గోఽధుమలకు రూ.4,982, తెల్లకుసుమలకు రూ.8,183, ఆవాలకు రూ.7,682 చొప్పున కనీస మద్దతు ధర నిర్ణయించాలని కోరుతూ ప్రభుత్వం తరఫున లేఖను సమర్పించారు.


వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహకాలు అందించి కూలీల కొరతకు పరిష్కారం చూపాలని, పసుపు, మిర్చి పంటలకు కూడా మద్దతు ధరల పరిధిలోకి తీసుకరావాలని, ఎమ్మెస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలుచేయాలని కోరారు. హైదరాబాద్‌లో శుక్రవారం సీఏసీపీ ఆధ్వర్యంలో దక్షిణ ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విత్తన మార్పిడి నిష్పత్తి, విత్తన లభ్యత, పంటల ఉత్పాదకత తదితర అంశాలపై చర్చించారు.

Updated Date - Jun 21 , 2025 | 03:17 AM