M Kodandareddy: విత్తనోత్పత్తికి తెలంగాణ అనువైన ప్రాంతం
ABN , Publish Date - Jul 10 , 2025 | 04:05 AM
విత్తనోత్పత్తికి తెలంగాణ అనువైన ప్రాంతమని, దేశంలో 60 శాతం విత్తనాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు.
రాష్ట్రంలో త్వరలో ఆదర్శ రైతుల వ్యవస్థ: కోదండరెడ్డి
విత్తనోత్పత్తికి తెలంగాణ అనువైన ప్రాంతమని, దేశంలో 60 శాతం విత్తనాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు. తెలంగాణ రైతులు ఉత్పత్తి చేసే విత్తనాలు ప్రపంచ దేశాలకూ ఎగుమతి అవుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం వరి, పత్తి, మొక్కజొన్న విత్తనోత్పత్తి ప్రక్రియ పురోగతిలో ఉండగా.. కేసీఆర్ పాలనలో మాత్రం అది దెబ్బతిన్నదని విమర్శించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలను సరఫరాచేసే కంపెనీలు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో ఆదర్శ రైతుల వ్యవస్థను తీసుకు రాబోతునట్లు తెలిపారు.