Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కొనసాగుతోంది
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:20 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్టేటస్ రిపోర్టు దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
స్టేటస్ రిపోర్టు దాఖలుకు సమయం ఇవ్వండి
సుప్రీంకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్టేటస్ రిపోర్టు దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. బీఆర్‌ఎస్ హయాంలో ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు బెయిల్ పిటిషన్ మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
దర్యాప్తు కొనసాగుతోందని, స్టేటస్ రిపోర్టు దాఖలుకు సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను 25కు వాయిదా వేసింది. అప్పటిదాకా ప్రభాకర్‌రావుకు మధ్యంతరరక్షణ కొనసాగుతుందని ధర్మాసనం తెలిపింది.