Share News

సమగ్ర విత్తన చట్టం ముసాయిదా కమిటీ చైర్మన్‌గా అన్వేష్‌‌‌‌రెడ్డి

ABN , Publish Date - May 15 , 2025 | 04:38 AM

తెలంగాణ సమగ్ర విత్తన చట్టం- 2025 ముసాయిదా కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ సుంకెట అన్వేష్‌‌‌‌రెడ్డి నియమితులయ్యారు.

సమగ్ర విత్తన చట్టం ముసాయిదా కమిటీ చైర్మన్‌గా అన్వేష్‌‌‌‌రెడ్డి

  • కన్వీనర్‌గా శివప్రసాద్‌ సహా సభ్యుల నియామకం

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సమగ్ర విత్తన చట్టం- 2025 ముసాయిదా కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ సుంకెట అన్వేష్‌‌‌‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముసాయిదా కమిటీ కన్వీనర్‌గా సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి కె.శివప్రసాద్‌ నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా న్యాయవాది ఎం.సునీల్‌ కుమార్‌, జయశంకర్‌ వర్సిటీ విత్తన విభా గం డైరెక్టర్‌ డాక్టర్‌ నగేశ్‌ కుమార్‌, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రామాంజనేయులు, వ్యవసాయశాఖ విశ్రాంత జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, వ్యవసాయ రంగ నిపుణులు డి.నరసింహారెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి సిఫార్సుల మేరకు... రాష్ట్రంలో సమగ్ర విత్తనచట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Updated Date - May 15 , 2025 | 04:38 AM