Share News

రేపు టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష

ABN , Publish Date - May 31 , 2025 | 04:07 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో 2025-26 ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌-25 ప్రవేశ పరీక్ష జూన్‌ 1న జరుగనుంది.

రేపు టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష

కేయూ క్యాంపస్‌, మే 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో 2025-26 ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌-25 ప్రవేశ పరీక్ష జూన్‌ 1న జరుగనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 78 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎడ్‌సెట్‌-25 కన్వీనర్‌, కేయూ ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ బైరు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. 38,758 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.


ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌లో కంప్యూటర్‌ ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఉదయం సెషన్‌లో 9.30 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌లో 1.30 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తామని పేర్కొన్నారు. నిర్దేశిత సమయం దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. చేశారు

Updated Date - May 31 , 2025 | 04:07 AM