Internal Marks System: టెన్త్‌లో 20 శాతం ఇంటర్నల్స్ యథాతథం
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:29 AM
పదోతరగతిలో ఇప్పటివరకు కొనసాగుతున్న ఇంటర్నల్ మార్కులను ఈ విద్యా సంవత్సరంలోనూ యధావిధిగా ...
ఈ విద్యా సంవత్సరంలోనూ కొనసాగింపు
పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): పదోతరగతిలో ఇప్పటివరకు కొనసాగుతున్న ఇంటర్నల్ మార్కులను ఈ విద్యా సంవత్సరంలోనూ యధావిధిగా కొనసాగించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కొన్నేళ్లుగా పదో తరగతిలో 20ు ఇంటర్నల్ మార్కుల విధానం కొనసాగుతుండగా, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులకు పూర్తిమార్కులు కేటాయిస్తున్నాయన్న ఆరోపణలొచ్చాయి. దీంతో ఈ విద్యా సంవత్సరం ఇంటర్నల్ మార్కులు తొలగించనున్నట్టు గతంలో ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు.