Share News

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:13 PM

ఈ నెల 21 నుంచి ప్రారంభం కాను న్న పదో తరగతి వార్షిక పరీక్షలు మాల్‌ ప్రాక్టీస్‌కు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ అమరేందర్‌

- అదనపు కలెక్టర్‌ అమరేందర్‌

- పదో తరగతి వార్షిక పరీక్షలపై సమీక్షా సమావేశం

నాగర్‌కర్నూల్‌టౌన్‌, మార్చి5 (ఆంధ్రజ్యో తి) : ఈ నెల 21 నుంచి ప్రారంభం కాను న్న పదో తరగతి వార్షిక పరీక్షలు మాల్‌ ప్రాక్టీస్‌కు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమా వేశం మందిరంలో పదో తరగతి వార్షిక పరీక్ష లపై జిల్లా విద్యాధికారితో కలిసి అదనపు కలెక్ట ర్‌ అమరేందర్‌ పరీక్షల చీఫ్‌ సూపరింటెండెం ట్లు, డిపార్టుమెంటు అధికారులతో సమీక్షా స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అద నపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. గతేఏడాది వార్షిక పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 21వ స్థానంలో ఉందని, ఈసారి కనీసం 10వ స్థానం లోపు సంపాదించుకునేలా విద్యార్థులను సన్న ద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులను కోరా రు. పరీక్ష ప్రశ్నాపత్రాలను పోలీసు స్టేషన్‌ నుం చి సరఫరా చేస్తారని, నిర్ణీత సమయంలో సీసీ కెమెరా ముందు వాటిని ఓపెన్‌ చేసి విద్యార్థుల కు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. పరీ క్ష ముగిసిన వెంటనే ప్యాకింగ్‌ చేసిన జవాబు పత్రాలను పోస్టాఫీసు ద్వారా పంపించాల్సి ఉంటుందన్నారు. జిల్లా విద్యాధికారి రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ పరీక్ష విధులకు హాజర య్యే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో కలెక్టరేట్‌ పరిపాలనాధికారి చం ద్రశేఖర్‌, విద్యాశాఖ జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్‌రావు, సెక్టోరియల్‌ అధికా రులు షర్పుద్దీన్‌, వెంకటయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 11:13 PM