Share News

Scientific Awards: తెలుగు ప్రొఫెసర్లకు అరుదైన గౌరవం

ABN , Publish Date - May 22 , 2025 | 05:37 AM

తెలుగు శాస్త్రవేత్తలు చెన్నుపాటి జగదీశ్‌, మల్లికార్జున్‌ తాటిపాముల‌కు రాయల్‌ సొసైటీ ఫెలోగా అరుదైన గౌరవం లభించింది. వీరిద్దరూ ఐఐటీ హైదరాబాద్‌కు మద్దతు ఇచ్చిన పరిశోధకులు.

Scientific Awards: తెలుగు ప్రొఫెసర్లకు అరుదైన గౌరవం

  • ఫెలో ఆఫ్‌ ది రాయల్‌ సొసైటీలో సభ్యులుగా చెన్నుపాటి జగదీశ్‌, మల్లికార్జున్‌ తాటిపాముల..

కంది, మే 21 (ఆంధ్రజ్యోతి): ఐఐటీ హైదరాబాద్‌తో అనుబంధమున్న ఇద్దరు విశిష్ట ప్రొఫెసర్లు.. అందులోనూ తెలుగు శాస్త్రవేత్తలకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ఫెలో ఆఫ్‌ ది రాయల్‌ సొసైటీలో సభ్యులుగా ప్రొఫెసర్లు చెన్నుపాటి జగదీశ్‌, మల్లికార్జున్‌ తాటిపాముల చోటు సంపాదించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్‌లో డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి వీరితో బుధవారం వర్చువల్‌గా మాట్లాడారు. ఈ ఇద్దరు ప్రొఫెసర్లు ఐఐటీహెచ్‌ విద్యార్థుల పరిశోధనలకు ఎంతో సహకరించారని.. విద్యార్థుల పురోభివృద్ధికి వీరి సహకారం మరువలేనిదని కొనియాడారు. ఐఐటీ హైదరాబాద్‌కు ఇది చారిత్రాత్మక క్షణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా వల్లూరుపాలెంలో జన్మించిన జగదీశ్‌ చెన్నుపాటి.. ప్రస్తుతం ఆస్ర్టేలియన్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆస్ర్టేలియా ప్రభుత్వం, పార్లమెంటుకు సలహాదారుగా కూడా పనిచేస్తున్నారు. వరంగల్‌లో జన్మించిన మల్లికార్జున్‌ తాటిపాముల.. అమెరికాలోని స్విన్‌బర్గ్‌కు చెందిన ఎరిక్సన్‌ సంస్థ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. టెలి కమ్యూనికేషన్స్‌ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2జీ నుంచి భవిష్యత్తు 6జీ నెట్‌వర్క్‌ వరకు.. దాదాపు 35 ఏళ్లుగా ఆ రంగంలో పరిశోధనలతో కృషి చేస్తున్నారు.

Updated Date - May 22 , 2025 | 05:38 AM