Book Launch: ఆంధ్రజ్యోతి వేదికగా ‘తెలుగు జాడలు’ పుస్తకావిష్కరణ
ABN , Publish Date - Mar 19 , 2025 | 07:08 AM
వివిధ దేశాల్లోని తెలుగువారి భాషా సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, జీవన విధానంపై ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ ఆర్‌ఎం. ఉమామహేశ్వరరావు రాసిన ‘
హైదరాబాద్ సిటీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): వివిధ దేశాల్లోని తెలుగువారి భాషా సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, జీవన విధానంపై ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ ఆర్‌ఎం. ఉమామహేశ్వరరావు రాసిన ‘తెలుగు జాడలు’ యాత్రానుభవాల సంపుటిని మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రజ్యోతి కార్యాలయంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఇందులోని వ్యాసాలన్నీ ఇది వరకు ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ప్రచురితమయ్యాయి. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాహుల్ కుమార్, అసిస్టెంట్ ఎడిటర్ వక్కలంక రమణ, తెలంగాణ నెట్‌వర్క్ ఇంచార్జి ఆర్. కృష్ణప్రసాద్, జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్, కవి యార్లగడ్డ రాఘవేంద్రరావు, ఏబీఎన్ అసోసియేట్ ఎడిటర్ సువర్ణకుమార్, ఆర్‌ఎం. ఉమామహేశ్వరరావు జీవిత సహచరి విష్ణుప్రియ, కుమార్తె రాగలీన పాల్గొన్నారు.
ఉమామహేశ్వరరావు రాసిన ‘తెలుగుజాడలు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, చిత్రంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాహుల్‌కుమార్, ఎడిటోరియల్ విభాగాధిపతులు, ఉమామహేశ్వరరావు కుటుంబసభ్యులు