Tourist Police: తెలంగాణలో త్వరలో టూరిస్ట్ పోలీసులు
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:57 AM
తెలంగాణలో పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని డీజీపీ జితేందర్ తెలిపారు.
మొదటి దశలో 80 మంది నియామకం
సెప్టెంబరు 27 నుంచి అమలు
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని డీజీపీ జితేందర్ తెలిపారు. మొదటి దశలో పర్యాటక ప్రాంతాల్లో 80 మంది పోలీసులు పనిచేయనున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతగిరి, సోమశిల, రామప్ప, యాదగిరి గుట్ట, పోచంపల్లి, నాగార్జునసాగర్, బుద్ధవనం, భద్రాచలం, అమ్రాబాద్ వంటి ముఖ్య పర్యాటక కేంద్రాల్లో వీరు సేవలందిస్తారని వివరించారు.
ఈ వ్యవస్థ ద్వారా స్వదేశీ, విదేశీ పర్యాటకులకు మెరుగైన భద్రత కల్పించవచ్చని, ఇది పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ పర్యాటక శాఖ, పోలీసు శాఖల మధ్య సమన్వయ సమావేశం బుధవారం డీజీపీ కార్యాలయంలో జరిగింది.