Share News

Anvesh Reddy: రైతు సంక్షేమానికే కొత్త విత్తన చట్టం

ABN , Publish Date - May 27 , 2025 | 04:08 AM

రైతుల సంక్షేమం కోసమే కొత్త విత్తన చట్టం తీసుకొస్తున్నట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి తెలిపారు.

Anvesh Reddy: రైతు సంక్షేమానికే కొత్త విత్తన చట్టం

  • రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమం కోసమే కొత్త విత్తన చట్టం తీసుకొస్తున్నట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి తెలిపారు. విత్తన చట్ట ముసాయిదా రూపకల్పనకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు, విత్తనాల తయారీ సంస్థలు, ఆర్గనైజర్లు, డీలర్లతో సంప్రదించి, వారి అభిప్రాయాలను సేకరిస్తామని చెప్పారు.


కొత్త విత్తన చట్టం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. సోమవారం రాష్ట్ర రైతు కమిషన్‌ కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వే్‌షరెడ్డి మాట్లాడుతూ.. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లోనూ అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేస్తామన్నారు. రైతులకు మేలు చేసేలా రాష్ట్ర విత్తన చట్టం పటిష్టంగా రూపొందించడానికి ఈ కమిటీ కృషి చేస్తుందని చెప్పారు.

Updated Date - May 27 , 2025 | 04:08 AM