Share News

Healthcare Department: ఆరోగ్య శాఖలో మళ్లీ కొలువుల జాతర

ABN , Publish Date - Aug 22 , 2025 | 04:42 AM

వైద్య ఆరోగ్య శాఖలో మరోసారి కొలువుల జాతర జరగబోతోంది. ఏకంగా 1,623 స్పెషలిస్టు డాక్టర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది.

Healthcare Department: ఆరోగ్య శాఖలో మళ్లీ కొలువుల జాతర

  • 1623 స్పెషలిస్టు డాక్టర్‌ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్‌

  • వైద్యుల భర్తీ ప్రక్రియలో రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్దది

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో మరోసారి కొలువుల జాతర జరగబోతోంది. ఏకంగా 1,623 స్పెషలిస్టు డాక్టర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. వైద్యుల భర్తీ ప్రక్రియలో ఇది రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్దదని వైద్య వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఆదేశించారు.


బోర్డు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఈ నియామకాలు పూర్తయితే జిల్లా, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పల్లెలకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇటీవలే 8 వేల వివిధ రకాల పోస్టులను భర్తీ చేశారు. మరో 7 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

Updated Date - Aug 22 , 2025 | 04:42 AM