Share News

Ponguleti: రెవెన్యూ గ్రామానికో జీపీవో: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Jul 12 , 2025 | 05:14 AM

రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పాలనాధికారి (జీపీవో)ని నియమిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు.

Ponguleti: రెవెన్యూ గ్రామానికో జీపీవో: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పాలనాధికారి (జీపీవో)ని నియమిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి సూచనల మేరకు రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో, మండలానికి భూ విస్తీర్ణం ఆధారంగా 4 నుంచి 6 మంది లైసెన్స్‌ సర్వేయర్లను నియమించబోతున్నామని ఆయన తెలిపారు. ఈనెల 27వ తేదీన శిక్షణ పొందిన సర్వేయర్లకు రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. 28, 29 తేదీల్లో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్‌ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.


ఆగస్టు 12వ తేదీన ఫలితాలు విడుదల చేసి, ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 40 రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వం నక్షా లేని గ్రామాలను గాలికి వదిలేస్తే సీఎం రేవంత్‌ రెడ్డి చొరవతో ఆ గ్రామాలకు పరిష్కారం చూపామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 413 గ్రామాలకు నక్షా లేదని, తొలి విడతలో 5 గ్రామాల్లో రీ సర్వే ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు వివరించారు. ఈ సర్వే ఫలితాలను పరిగణనలోకి తీసుకుని మిగిలిన గ్రామాల్లోనూ రీ సర్వే నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 05:14 AM