Telangana secretariat: తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు.. ఊడిపడుతున్న పెచ్చులు..
ABN , Publish Date - Feb 12 , 2025 | 07:55 PM
తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. సచివాలయం ఏడో అంతస్తు నుంచి ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పెచ్చు ఊడిపడడంతో ఉద్యోగులందరూ ఉలిక్కిపడ్డారు.

తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. సచివాలయం ఏడో అంతస్తు నుంచి ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పెచ్చు ఊడిపడడంతో ఉద్యోగులందరూ ఉలిక్కిపడ్డారు. అదృష్టావశాత్తూ అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సచివాలయం సౌత్ ఈస్ట్ ప్రధాన ద్వారం వద్ద ఈ పెచ్చులు ఊడి పడ్డాయి. కాగా, ఈ ఘటనలో ఓ కారు ధ్వంసమైనట్టు సమాచారం. సచివాలయంల ఆరో అంతస్తులోనే సీఎం కార్యాలయం, సీఎస్ కార్యాలయం ఉన్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..