Kakatiya University: నేటి నుంచి కేయూలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:36 AM
సైన్స్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయం..
కేయూ క్యాంపస్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): సైన్స్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) ఈసారి తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతా్‌పరెడ్డి తెలిపారు. ఈ నెల 19 నుంచి 21 వరకు ఈ సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు. కేయూ, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైస్సెస్ సంయుక్తంగా ఈ సైన్స్ కాంగ్రె్‌సను నిర్వహిస్తోందన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 19 వరకు సంబురాలు జరుగుతాయని తెలిపారు. ‘సాధికారత కోసం నూతన ఆవిష్కరణలు, యువతభారత్ కోసం శాస్త్ర సాంకేతికత’ అనే థీమ్‌తో సదస్సు జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే సైన్స్ కాంగ్రె్‌సలో 65 ముఖాముఖి కార్యక్రమాలతో పాటు ఐదుగురు సీనియర్ ప్రొఫెసర్లు, ల్యాబ్స్ డైరెక్టర్లు రెండు ప్లీనరీ సెషన్లలో కీలక ప్రసంగం చేస్తారు.