Share News

Veterinary Officers: ముగిసిన రిటైర్డ్‌ వెటర్నరీ అధికారుల సంఘం సర్వ సభ్య సమావేశం

ABN , Publish Date - Aug 08 , 2025 | 04:47 AM

తెలంగాణ విశ్రాంత వెటర్నరీ అధికారుల సంఘం రెండో సర్వ సభ్య సమావేశం వెటర్నరీ కాలేజీలో గురువారం జరిగింది.

Veterinary Officers: ముగిసిన రిటైర్డ్‌ వెటర్నరీ అధికారుల సంఘం సర్వ సభ్య సమావేశం

హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విశ్రాంత వెటర్నరీ అధికారుల సంఘం రెండో సర్వ సభ్య సమావేశం వెటర్నరీ కాలేజీలో గురువారం జరిగింది. సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ అనంతయ్య సమావేశాన్ని ప్రారంభించి.. గతేడాది కన్నుమూసిన సభ్యుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఇటు నిరుడు నిర్వహించిన వివిధ కార్యక్రమాలను డాక్టర్‌ దుర్గయ్య విపులంగా వివరించారు. కోశాధికారి డాక్టర్‌ రెడ్డి ఆర్థిక వివరాలు, వార్షిక ఖాతాలపై వివరణ ఇచ్చారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు డాక్టర్‌ విజయ రామారావు చేసిన సేవలను గుర్తించి ఆయన్ను సన్మానించారు.


సమావేశానికి పశువైద్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ జ్ఞానప్రకాశ్‌, పశువైద్య కళాశాల డీన్‌ డాక్టర్‌ మాధురి హాజరై సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఇటు విశిష్ట సేవలు అందించిన ఆరుగురు సభ్యులను వీసీ జ్ఞానప్రకాశ్‌ సన్మానించారు.

Updated Date - Aug 08 , 2025 | 04:47 AM