Share News

హ్యామ్‌ రోడ్ల ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఒక పేరు!

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:44 AM

హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌(హ్యామ్‌)లో నిర్మించనున్న రోడ్ల ప్రాజెక్టుకు మంచి పేరు పెట్టాలని ఆర్‌ అండ్‌బీ అధికారులు యోచిస్తున్నారు.

హ్యామ్‌ రోడ్ల ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఒక పేరు!

  • కసరత్తు చేస్తున్న ఆర్‌ అండ్‌ బీ అధికారులు

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌(హ్యామ్‌)లో నిర్మించనున్న రోడ్ల ప్రాజెక్టుకు మంచి పేరు పెట్టాలని ఆర్‌ అండ్‌బీ అధికారులు యోచిస్తున్నారు. కర్ణాటకలోనూ అక్కడి ప్రభుత్వం కూడా పలు రహదారులను ఉన్నతీకరించింది. ఈ ప్రాజెక్టుకు ‘కర్ణాటక- స్టేట్‌ హైవేస్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు(కే-షి్‌ప)’గా నామకరణం చేసింది. దశలవారీగా అభివృద్ధి చేసిన రోడ్లన్నింటికీ కే-షిప్‌-1, కే-షిప్‌-2 పేరుతో పనులు చేపట్టగా, ఇప్పటికే కొన్ని పనులు పూర్తయ్యాయి.


అలాగే, ఇటీవల తెలంగాణలో జరిగిన మిస్‌వరల్డ్‌- 2025 పోటీలకు ‘‘తెలంగాణ జరూర్‌ ఆనా’’ క్యాప్షన్‌ జోడిండంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అదే తరహాలో హ్యామ్‌ రోడ్ల ప్రాజెక్టుకూ ఒక పేరు పెట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొదటి దశ రోడ్లకు టెండర్లు పూర్తయ్యేలోపు ఖరారు చేయాలని యోచిస్తున్నారు.

Updated Date - Jun 16 , 2025 | 04:44 AM