Share News

TGPGECET 2025: నేడు పీజీ ఈసెట్‌ ఫలితాలు

ABN , Publish Date - Jun 26 , 2025 | 03:55 AM

ఇంజనీరింగ్‌, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించిన తెలంగాణ పీజీఈసెట్‌-2025 పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.

TGPGECET 2025: నేడు పీజీ ఈసెట్‌ ఫలితాలు

  • మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్న ఉన్నత విద్యామండలి చైర్మన్‌

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించిన తెలంగాణ పీజీఈసెట్‌-2025 పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని పీజీఈసెట్‌ కన్వీనర్‌ అరుణకుమారి తెలిపారు. పీజీఈసెట్‌ మూల్యాంకనం గతవారమే ముగిసినా.. ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తకు ఉన్నతాధికారులు స్పందించడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 26 , 2025 | 03:55 AM