Share News

పీఈసెట్‌ ఫలితాల్లో 95శాతం ఉత్తీర్ణత

ABN , Publish Date - Jun 18 , 2025 | 04:28 AM

వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పీఈసెట్‌ ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి.

పీఈసెట్‌ ఫలితాల్లో 95శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పీఈసెట్‌ ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి, పీఈసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎన్‌ఎస్‌ దిలీప్‌ ఫలితాలను విడుదల చేశారు.


బీపీఈడీ, డీపీఈడీ పరీక్షలకు మొత్తం 1,767 మంది హాజరవగా 1,678 (95ు) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బీపీఈడీ పరీక్షకు 1,307 మంది హాజరవగా 1,252 (95.79ు), డీపీఈడీ పరీక్షలో 460 మందికి 426 (92.61ు) మంది ఉత్తీర్ణత సాధించారని ఆచార్య ఎన్‌ఎస్‌ దిలీప్‌ తెలిపారు.

Updated Date - Jun 18 , 2025 | 04:28 AM