Bonalu: 26న గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం
ABN , Publish Date - Jun 21 , 2025 | 04:40 AM
రాష్ట్ర ప్రజలు నెలరోజుల పాటు అంగరంగవైభవంగా జరుపుకొనే బోనాల ఉత్సవాలు ఈనెల 26 నుంచి జరుగుతాయి. ఆ రోజు గోల్కొండ కోటలోని ఎల్లమ్మ(జగదాంబిక) ఆలయంలో ఉత్సవాలు మొదలవుతాయి.
నార్సింగ్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలు నెలరోజుల పాటు అంగరంగవైభవంగా జరుపుకొనే బోనాల ఉత్సవాలు ఈనెల 26 నుంచి జరుగుతాయి. ఆ రోజు గోల్కొండ కోటలోని ఎల్లమ్మ(జగదాంబిక) ఆలయంలో ఉత్సవాలు మొదలవుతాయి. జ్యేష్ఠ ఆమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
ఈసారి ఆ అమావాస్య ఈనెల 25న వస్తుండటంతో ఆ మర్నాడు గురువారం బోనాల జాతరకు తెరలేవనుంది. గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో పూజలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో ఆఖరి రోజు గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో ఉత్సవాలు పూర్తవుతాయి.