Share News

Telangana Ministers Visit Mangalagiri: మంగళగిరిలో తెలంగాణ మంత్రులు

ABN , Publish Date - Aug 11 , 2025 | 04:40 AM

ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేశారు

Telangana Ministers Visit Mangalagiri: మంగళగిరిలో తెలంగాణ మంత్రులు

  • ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన భట్టి, ఉత్తమ్‌, కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరి

  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హెలీప్యాడ్‌లో దిగిన మంత్రులు

  • ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ స్వాగతం

అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేశారు. ఆదివారం హెలీకాప్టర్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకున్నారు. ఇందుకోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న హెలీప్యాడ్‌ను వారు ఉపయోగించుకున్నారు. ఈ హెలీప్యాడ్‌ను పవన్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. మంగళగిరి వచ్చిన తెలంగాణ మంత్రులకు పవన్‌ కల్యాణ్‌ తరఫున జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌, ఆ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. పవన్‌ పంపించిన కొండపల్లి బొమ్మలు, జ్ఞాపికలను హరిప్రసాద్‌ అందజేశారు. తిరుగు ప్రయాణంలో వారితో పాటు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లారు.

Updated Date - Aug 11 , 2025 | 04:40 AM