Thummala Nageswar Rao: రైతుల జీవితాలతో కేంద్రం ఆటలు: తుమ్మల
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:16 AM
యూరియా, ఎరువుల సరఫరాపై రైతుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు
హైదరాబాద్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): యూరియా, ఎరువుల సరఫరాపై రైతుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. తమ ఎంపీలు బుధవారం కూడా పార్లమెంట్‌లో కేంద్ర మంత్రిని కలిసి రాష్ర్టానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియా సరఫరా చేయాల్సిందిగా కోరారని ఆయన తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణకు 9.80లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినా, ఏప్రిల్ నుంచి జూలై వరకు 32ు కొరత ఏర్పడిందని చెప్పారు. మే నెలలో 45ువరకు లోటు, ఆగస్టు నెలలో 35ు కొరత కొనసాగడం రైతులపై కేంద్ర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. యూరియాలోటును తక్షణమే భర్తీచేయాలని తుమ్మల డిమాండ్ చేశారు.