Lab Technician: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల రెండో మెరిట్ లిస్ట్ విడుదల
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:37 AM
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు సంబంధించి రెండో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం విడుదల చేసింది.
సర్టిఫికెట్ల పరిశీలనకు 2,116 మంది ఎంపిక
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు సంబంధించి రెండో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన కోసం 1:1.5 ప్రాతిపాదికన మొత్తం 2,116 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. జాబితాలో ఉన్న అభ్యర్థులు అక్టోబరు 9 నుంచి 18 వరకు హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో హాజరుకావాలని బోర్డు తెలిపింది. అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, జన్మదిన, కుల, నాన్-క్రీమీలేయర్ తదితర ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినా, వెరిఫికేషన్‌కు హాజరు కాకపోయినా వారి అర్హతను రద్దు చేస్తామని బోర్డు తెలిపింది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలెక్షన్ జాబితా విడుదలవుతాయి. ఆగస్టు 7న మొదటి ప్రొవిజనల్ మెరిట్‌లి్‌స్టను బోర్డు విడుదల చేసినప్పటికీ, కొంతమంది అభ్యర్థులు తప్పు డు అనుభవ ధ్రువీకరణ పత్రాలను సమర్పించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రెండో ప్రొవిజనల్ మెరిట్‌లి్‌స్టను విడుదల చేసినట్లు తెలిసింది.