Telangana IPS Officers: తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీ
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:13 PM
తెలంగాణ రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బదిలీ ఐన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బదిలీ ఐన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు ఉన్నారు. ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం స్థాన చలనం కల్పించారు. మిగిలిన 14 మంది ఎస్పీలను కూడా బదిలీ చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా గౌస్ ఆలంను నియమించారు.
బదిలీ అయిన అధికారుల వివరాలు..
కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా గౌస్ ఆలం
అదనపు డీజీ (పర్సనల్)గా అనిల్ కుమార్. అలాగే ఎస్పీఎఫ్ డైరెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు.
సీఐడీ డీజీగా ఎం.శ్రీనివాసులు
వరంగల్ కమిషనర్‌గా సన్‌ప్రీత్ సింగ్
నిజామాబాద్ కమిషనర్‌గా సాయి చైతన్య
రామగుండం కమిషనర్‌గా అంబర్ కిషోర్
ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మ
భువనగిరి డీసీపీగా అకాంక్ష యాదవ్
మహిళా భద్రతా విభాగం ఎస్పీగా చేతన
నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర
సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..