హైకోర్టు పరిధిలో 1673 పోస్టులకు నోటిఫికేషన్
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:28 AM
తెలంగాణ హైకోర్డు పరిధిలోని 1673 టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ వంటి నాన్‌టెక్నికల్ పోస్టులు 1277, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ వంటి టెక్నికల్ పోస్టులు 184 ఉన్నాయి.

హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్డు పరిధిలోని 1673 టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ వంటి నాన్‌టెక్నికల్ పోస్టులు 1277, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ వంటి టెక్నికల్ పోస్టులు 184 ఉన్నాయి. ఇక హైకోర్టులో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పోస్టులు 212 ఉన్నాయి. జిల్లా న్యాయస్థానాలు, హైకోర్టు పరిధిలో ఉన్న ఈ ఖాళీలకు ఆయా పోస్టుల అర్హతలను అనుసరించి దరఖాస్తులను జనవరి 31లోగా పంపుకోవాలి. వయస్సు, విద్యార్హతలు వంటి వివరాల కోసం జ్ట్టిఞట://్టటజిఛి.జౌఠి.జీుఽ/ వెబ్‌సైట్ చూడొచ్చు.