MBBS Seats: ఎంబీబీఎస్ సీట్ల స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తాత్కాలిక తీర్పు
ABN , Publish Date - Jul 28 , 2025 | 06:45 PM
MBBS Seats: కేఎన్ఆర్‌యూహెచ్ఎస్ కౌన్సెలింగ్ దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. తుది తీర్పు వచ్చే వరకు రిజిస్ట్రేషన్‌లో చేర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంబీబీఎస్ సీట్ల స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తాత్కాలిక తీర్పును ఇచ్చింది. కేఎన్ఆర్‌యూహెచ్ఎస్ కౌన్సెలింగ్ దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. తుది తీర్పు వచ్చే వరకు రిజిస్ట్రేషన్‌లో చేర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో సుమారు 100 మంది అభ్యర్థులకు తాత్కాలిక ఊరట లభించింది. జూలై 30వ తేదీతో రిజిస్ట్రేషన్ ముగియనుండటంతో హైకోర్టు ఈ కీలక తీర్పు నిచ్చింది.
శాశ్వత నివాసంతోనూ స్థానికత మంజూరు చేయాలని కోర్టు అభిప్రాయపడింది. గత ఏడాది ఇచ్చిన హైకోర్టు ఆర్డర్స్ ఫాలో కావాలని ఆదేశించింది. కాగా, జూలై 15వ తేదీన విడుదలైన ప్రాస్పెక్టస్, నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. నోటిఫికేషన్‌లోని రూల్ 3లో 4 ఏళ్ల చదువు/నివాస నిబంధనపై అభ్యంతర వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తాత్కాలిక తీర్పును ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకున్న డాగ్ బాబు.. తర్వాత ఏం జరిగిందంటే..
70 ఏళ్ల బామ్మ సాహసం.. పామును మెడకు చుట్టుకుని..