Group-2 Results: గ్రూప్-2లో పురుషుల హవా
ABN , Publish Date - Mar 12 , 2025 | 04:44 AM
లక్షల మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్-2 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. గత ఏడాది డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కులతో పాటు..

టాప్ 10 ర్యాంకులన్నీ వారికే..
447 మార్కులతో హర్షవర్ధన్‌కు మొదటిస్థానం
తర్వాతి స్థానాల్లో సచిన్, మనోహర్‌రావు
జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): లక్షల మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్-2 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. గత ఏడాది డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కులతో పాటు.. జనరల్ ర్యాంకుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. దీంతోపాటు.. గ్రూప్-2 ఫైనల్ కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్లతోపాటు.. అభ్యర్థులు తమ ఐడీతో లాగిన్ అయ్యి ఓఎంఆర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సారి ఫలితాల్లో టాప్-10 ర్యాంకర్లంతా పురుషులే కావడం గమనార్హం..! 447 మార్కులతో నారు వెంకట హరవర్ధన్(ఓసీ-మల్టీజోన్ 1) టాపర్‌గా నిలిచారు. ఈయన మొత్తం 600 మార్కుల్లో 74.5ు సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో 444 మార్కులతో వడ్లకొండ సచిన్(బీసీ-బీ-మల్టీజోన్ 1), 439 మార్కులతో బి.మనోహర్ రావు(బీసీ-డీ, మల్టీజోన్ 2) నిలిచారు. మహిళల్లో 408 మార్కులతో లక్కిరెడ్డి వినిషారెడ్డి(ఓసీ-మల్టీజోన్ 2) టాపర్‌గా నిలవగా, 406 మార్కులతో బైకాడి సుస్మిత(బీసీ-బీ, మల్టీజోన్ 1), 399 మార్కులతో కొప్పు శ్రీవేణి(బీసీ-డీ, మల్టీజోన్ 2) తర్వాతి స్థానాలను సాధించారు.
చెల్లని అభ్యర్థులు 13,315
వివిధ ప్రభుత్వ శాఖల్లోని మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఈ పరీక్షను నిర్వహించగా.. 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,49,964 మంది రెండ్రోజుల్లో రోజుకు రెండేసి సెషన్లలో 4 పేపర్లకు జరిగిన పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 13,315 మంది చెల్లని(ఇన్‌వ్యాలిడ్) అభ్యర్థులుగా ప్రకటించారు. మిగతా 2,36,649 మంది అభ్యర్థులతో జనరల్ ర్యాంకింగ్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఫైనల్ కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను ఏప్రిల్ 9 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్లను వ్యక్తిగత లాగిన్‌లలో టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి.. రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీ ఆధారంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బుర్రా వెంకటేశం తెలిపారు. జనరల్ ర్యాంకింగ్స్ ఆధారంగా తగిన సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేస్తారు. వారికి వ్యక్తిగతంగా, టీజీపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా సమాచారం అందిస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో పేర్కొన్న ప్రకారం.. అభ్యర్థులు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ కోరింది. ఏవైనా సాంకేతికపరమైన సమస్యలు తలెత్తితే.. టీజీపీఎస్సీ హెల్ప్‌డె్‌స్కను 040-23542185, 040-23542187 నంబర్లకు ఫోన్ చేసి, సంప్రదించాలని కోరింది.
సివిల్స్‌కు సిద్ధమవుతూ..
కోదాడ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-2లో 447 మార్కులతో టాపర్‌గా నిలిచిన నారు వెంకట హర్షవర్ధన్‌రెడ్డి స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ. ఈయన తండ్రి రవణారెడ్డి కోదాడ కేఆర్‌ఆర్ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న హర్షవర్ధన్.. తొలి ప్రయత్నంలోనే గ్రూప్-2ను సాధించారు. ఖమ్మంలో పదోతరగతి, విజయవాడలో ఇంటర్, 2021లో బీటెక్ పూర్తిచేసిన హర్షవర్ధన్.. సివిల్స్ కోసం ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో.. 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలవ్వడంతో.. ఈ పరీక్షలపై దృష్టి సారించారు.
సాఫ్ట్‌వేర్ నుంచి గ్రూప్-2కు..
సిద్దిపేట కల్చరల్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రెండో ర్యాంకు సాధించిన వడ్లకొండ సచిన్.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్సాన్‌పల్లికి చెందినవారు. ఢిల్లీలోని బీఎంఎల్ ముంజాల్ వర్సిటీలో ఉన్నత విద్య పూర్తిచేసి, రెండేళ్లు సాఫ్ట్‌వేర్ రంగంలో నిచేశారు. పోటీ పరీక్షలపై ఆసక్తితో గ్రూప్-2పై దృష్టిసారించి, రెండో ర్యాంకు సాధించారు. ఈయనకు గ్రూప్-1లో 461.5 మార్కులు వచ్చాయి.
ప్రభుత్వోద్యోగాలను సాధిస్తూ..
నారాయణఖేడ్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మూడో ర్యాంకు సాధించిన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ సిర్గాపూర్ మండలం ఉజలంపాడ్‌కు చెందిన బి.మనోహర్‌రావు.. ఇప్పటికే పలు ప్రభుత్వోద్యోగాలను సాధించారు. నారాయణఖేడ్‌లో డిగ్రీ పూర్తిచేసిన మనోహర్.. 2012లో హైదరాబాద్ వీవీ కళాశాలలో ఎకనామిక్స్‌లో పీజీ పూర్తిచేశారు. ఆ తర్వాత బీఈడీ చేసి.. వరుసగా టీజీటీ, పీజీటీ ఉద్యోగాలు సాధించారు. ఆ తర్వాత గ్రూప్-2లో సత్తాచాటి డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు. వికారాబాద్ జిల్లాలో కొంతకాలం పనిచేశాక.. ఒకేసారి స్కూల్ అసిస్టెంట్, జేఎల్ ఉద్యోగాలను సాధించారు. దాంతో.. డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాన్ని వీడి.. స్కూల్ అసిస్టెంట్‌గా చేరారు. మరోసారి గ్రూప్-2కు ర్యాంకు కొట్టారు. గ్రూప్-1లోనూ ఆయన 430 మార్కులను సాధించడం గమనార్హం..!
గ్రూప్-2 రాష్ట్ర టాపర్లు
ర్యాంకు పేరు మార్కులు రిజర్వేషన్/
మల్టీజోన్
1 నారు వెంకట హరవర్ధన్ 447 ఓసీ/1
2 వడ్లకొండ సచిన్ 444 ఓసీ/1
3 బి.మనోహర్‌రావు 439 బీసీ-డీ/2
4 శ్రీరాం మధు 438 బీసీ-బీ/2
5 చింతల్‌పల్లి ప్రీతమ్ రెడ్డి 431 ఓసీ/1
6 అఖిల్ ఎర్ర 430 ఓసీ/2
7 గొడ్డేటి అశోక్ 425 బీసీ-బీ/1
8 చిమ్ముల రాజశేఖర్ 423.93 ఓసీ/2
9 మేకల ఉపేందర్ 423.12 బీసీ-డీ/1
10 కరింగు నరేశ్ 422 బీసీ-బీ/2
మహిళా టాపర్లు..
ర్యాంకు పేరు మార్కులు రిజర్వేషన్/
మల్టీజోన్
1 లక్కిరెడ్డి వినిషారెడ్డి 408 ఓసీ/2
2 బైకాడి సుస్మిత 406 బీఈ-బీ/1
3 కొప్పు శ్రీవేణి 399 బీసీ-డీ/2
4 వీరంరెడ్డి శ్రీలత 393 ఓసీ/2
5 గొట్టిముక్కుల స్నేహ 390 బీసీ-బీ/2
6 బిల్ల శ్రావణి 389 బీసీ-బీ/1
7 ఎరడ్ల నిఖిత 387 ఓసీ/1
8 స్రవంతి 386.56 ఓసీ/2
9 మిల్కూరి సాయిచందన 386.11 బీసీ-డీ/1
10 ధారావత్ అనూష 385 ఎస్‌టీ/2
ఈ వార్తలు కూడా చదవండి:
Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు
Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..