Share News

BC Reservation: బీసీ రిజర్వేషన్లు 21.39శాతం

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:56 AM

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయంటూ విపక్షాలు, వివిధ సంఘాల ఆరోపణలు అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది....

BC Reservation: బీసీ రిజర్వేషన్లు 21.39శాతం

  • 17 శాతానికి తగ్గించారన్న విపక్షాల ఆరోపణలు పూర్తిగా అవాస్తవం

  • 2019 పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈసారీ రిజర్వేషన్ల ఖరారు

  • కానీ ఎస్టీ నోటిఫైడ్‌ గ్రామాలను కలిపి లెక్కించడంతో వాస్తవాలు తారుమారు

  • నిజానికి 8 జిల్లాల్లో పెరిగిన బీసీ రిజర్వేషన్లు

  • సుప్రీం ఆదేశాలకు అనుగుణంగానే ప్రక్రియ

  • పంచాయతీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయంటూ విపక్షాలు, వివిధ సంఘాల ఆరోపణలు అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. బీసీ రిజర్వేషన్లను 17శాతానికి తగ్గించారంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పు అని.. బీసీ రిజర్వేషన్లు 21.39 శాతంగా ఉన్నాయని బుధవారం లెక్కలతో సహా వెల్లడించింది. 2019లో, ప్రస్తుతం పంచాయతీ రిజర్వేషన్ల తీరును ప్రజల ముందు పెట్టింది. పూర్తిగా ఎస్టీలకే కేటాయించే నోటిఫైడ్‌ గ్రామాలను కూడా కలిపి లెక్కించడంతోనే వాస్తవాలు తారుమారు అయ్యాయని స్పష్టం చేసింది.


సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్నిరకాల రిజర్వేషన్లు కలిపి 50శాతం మించకూడదన్న నిబంధనను పాటించామని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు ఉండగా.. అందులో 2,537 గ్రామాలు షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ గ్రామాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయిస్తారు. బీసీ, ఇతర రిజర్వేషన్లేవీ వర్తించవు. నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని మిగతా 10,223 పంచాయతీల్లో బీసీలకు 2,186 పంచాయతీలు రిజర్వు అయ్యాయి. అంటే 21.39 శాతం పంచాయతీలు బీసీలకు కేటాయించారు.


2019 పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22.78ు రిజర్వేషన్‌ అందింది. అయితే గతంలో రాష్ట్రంలో 1,177 ఎస్టీ నోటిఫైడ్‌ పంచాయతీలు ఉండగా, ఈసారి ఆ సంఖ్య 1,248కు పెరిగింది. దీనికితోడు బీసీ జనాభా ఎక్కువగా ఉన్న 214 గ్రామాలు మున్సిపాలిటీలలో విలీనం కావడం, 223 కొత్త పంచాయతీల ఏర్పాటు, మండలాలు యూనిట్‌గా రిజర్వేషన్ల ఖరారు వంటి కారణాలతో బీసీ రిజర్వేషన్ల శాతం స్వల్పంగా తగ్గింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Young Sub-Inspectors: దోచుకునేందుకే పోలీస్ డిపార్టుమెంట్‏లోకి...

Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

Updated Date - Nov 27 , 2025 | 08:39 AM