Share News

Solar Pumps: అటవీ భూముల్లో 50వేల సౌర విద్యుత్‌పంపుసెట్లు

ABN , Publish Date - Jan 22 , 2025 | 05:09 AM

అటవీ హక్కుల రక్షణ చట్టం (ఆర్‌వోఎ్‌ఫఆర్‌) ద్వారా పట్టాలు పొందిన భూముల్లో తొలి విడత లో 50 వేల సౌర విద్యుత్‌ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా తెలిపారు. సచివాలయంలో దక్షిణ డిస్కమ్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, గిరిజన సంక్షేమ కమిషనర్‌ శరత్‌, అదనపు పీసీసీఎఫ్‌ సునీతా భగవత్‌, తెలంగాణ రెడ్‌కో వీసీ ఎండీ వి.అనిలతో కలిసి మంగళవారం సమీక్ష జరిపారు.

Solar Pumps: అటవీ భూముల్లో 50వేల సౌర విద్యుత్‌పంపుసెట్లు

ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి

హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): అటవీ హక్కుల రక్షణ చట్టం (ఆర్‌వోఎ్‌ఫఆర్‌) ద్వారా పట్టాలు పొందిన భూముల్లో తొలి విడత లో 50 వేల సౌర విద్యుత్‌ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా తెలిపారు. సచివాలయంలో దక్షిణ డిస్కమ్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, గిరిజన సంక్షేమ కమిషనర్‌ శరత్‌, అదనపు పీసీసీఎఫ్‌ సునీతా భగవత్‌, తెలంగాణ రెడ్‌కో వీసీ ఎండీ వి.అనిలతో కలిసి మంగళవారం సమీక్ష జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌వోఎ్‌ఫఆర్‌ కింద వ్యవసాయ భూముల్లో 2.5 లక్షల సౌర విద్యుత్‌ పంపుసెట్లు అవసరం అవుతాయని సుల్తానియా తెలిపారు. కేంద్ర పునరుద్ధరణీయ ఇంధన మంత్రిత్వశాఖ శాఖ పీఎం కుసు మ్‌ పథకం కింద లక్ష సౌర విద్యుత్‌ పంపుసెట్లను రాష్ట్రానికి మంజూరు చేసిందని, ఆ పథకాన్ని వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.


ఈ పంపులు ఏర్పాటు చేయడానికి ఏమేరకు నిధులు అవసర మో సమగ్ర సర్వే చేయాలని ఆదేశించారు. సచివాలయంలో పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి లోకే్‌షకుమార్‌, సెర్ప్‌ సీఈవో దివ్య, దక్షిణ డిస్కమ్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీతో పాటు స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ) జీఎంలతో ఆయన మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కరెండు రోజుల్లో వర్క్‌ ఆర్డర్లు మహిళా సంఘాల ద్వారా సౌరవిద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రెండు రోజుల్లో వర్క్‌ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వ విభాగాలు నిర్ణయించాయి. ఈమేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకే్‌షకుమార్‌ ఆర్థికశాఖ అధికారులతో కలిసి మంగళవారం సచివాలయంలో బ్యాంకర్లతో చర్చలు జరిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Updated Date - Jan 22 , 2025 | 05:09 AM