Share News

తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:32 PM

రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమ కారు నికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం అన్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
సోమగూడెంలో కోదండరాంను సన్మానిస్తున్న జేఏసీ నాయకులు

-ఎమ్మెల్సీ కోదండరాం

కాసిపేట, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమ కారు నికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సోమవారం కాగజ్‌నగర్‌లో మృతిచెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఇస్తారి కుటుంబాన్ని పరామర్శించి తిరుగు ప్రయాణంలో సోమగూడెంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని జేఏసీలు సమర్ధవంతంగా పనిచేసి రాష్ట్ర సాధనలో క్రీయాశీలక పాత్ర పోషించాయన్నారు. పోలీసుల లాఠీ దెబ్బలు ఎదుర్కొని నిలిచిన ఉద్య మకారులను ప్రభుత్వం గుర్తించి అన్ని విధాలుగా ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఇంటి స్థలాలు, పెన్షన్‌లు ఇచ్చేలా ప్రభుత్వానికి విన్నవిస్తానని తెలిపారు. అనంతరం సోమగూడెం జేఏసీ నాయకులు కోదండరాం ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు దుర్గం గోపాల్‌, గోనెల శ్రీనివాస్‌, కొమ్ముల బాపు, సిలోజు మురళీ, సాపాట్‌ శంకర్‌, ఆత్రం సంజీవ్‌, సట్ర భీంరావు, రాజయ్య, దుర్గం పోశం, కొయ్యడ శ్రీనివాస్‌, కృష్ణ, రాజ్‌కుమార్‌, చంద్రమౌళి, సండ్ర భూమన్న, సిరాజ్‌ఖాన్‌, భాగ్యలక్ష్మీ, లక్ష్మీ, మల్లేష్‌, చిన్నభీమయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 11:32 PM