Share News

Public Debt: రూ.5000 కోట్ల అప్పు తీసుకోనున్న రాష్ట్రం

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:03 AM

రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ గా అప్పు తీసుకోనుంది. ఏకంగా రూ.5000 కోట్ల అప్పు తీసుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు శుక్రవారం ఇండెంటు పెట్టింది.

Public Debt: రూ.5000 కోట్ల అప్పు తీసుకోనున్న రాష్ట్రం

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ గా అప్పు తీసుకోనుంది. ఏకంగా రూ.5000 కోట్ల అప్పు తీసుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు శుక్రవారం ఇండెంటు పెట్టింది. 19 ఏళ్ల కాల పరిమితితో రూ.1000 కోట్లు, 22 ఏళ్ల కాల పరిమితితో రూ.1000 కోట్లు, 23 ఏళ్ల కాల పరిమితితో రూ.2000 కోట్లు, 24 ఏళ్ల కాల పరిమితితో రూ.1000కోట్ల చొప్పున అప్పు తీసుకుంటామని ఆర్‌బీఐకి తెలియజేసింది. ఈనెల5న ఆర్‌బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా రుణాన్ని సేకరించనుంది.

Updated Date - Aug 02 , 2025 | 04:03 AM