Share News

Banakacharla project: ఏపీతో తదుపరి చర్చల్లేవు!

ABN , Publish Date - Aug 13 , 2025 | 05:45 AM

కృష్ణా, గోదావరి నదులపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చల కోసం ఇరు రాష్ట్రాల అధికారులతో అంతర్రాష్ట్ర కమిటీ ఏర్పాటు విషయంలో ముందుకెళ్లరాదని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.

Banakacharla project: ఏపీతో తదుపరి చర్చల్లేవు!

  • సాగునీటి ప్రాజెక్టులపై అటకెక్కిన అంతర్రాష్ట్ర కమిటీ

  • బనకచర్లపై చర్చలు అవసరం లేదని సర్కార్‌ నిర్ణయం

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : కృష్ణా, గోదావరి నదులపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చల కోసం ఇరు రాష్ట్రాల అధికారులతో అంతర్రాష్ట్ర కమిటీ ఏర్పాటు విషయంలో ముందుకెళ్లరాదని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. గత నెల 16వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబుతో నిర్వహించిన సమావేశంలో ఈ కమిటీ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే.


తెలంగాణ నుంచి ఐదుగురు, ఏపీ నుంచి ఐదుగురు, కేంద్ర జల వనరుల సంఘం నుంచి ఇద్దరు.. మొత్తం 12 మంది అధికారులతో ఇందుకు కమిటీ వేయాలని అప్పట్లో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో కమిటీ వేయాలని నిర్ణయించగా.. నెల రోజులు కావస్తున్నా.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ అక్రమంగా నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఆ రాష్ట్రంతో చర్చలు జరపాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాకే.. కమిటీ దిశగా ముందుకు వెళ్లరాదని నిర్ణయించినట్లు సమాచారం.

Updated Date - Aug 13 , 2025 | 05:45 AM