Share News

Government Employees: రేపు ఉద్యోగుల జేఏసీ ప్రత్యక్ష సమావేశం

ABN , Publish Date - Jul 25 , 2025 | 05:08 AM

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

Government Employees: రేపు ఉద్యోగుల జేఏసీ ప్రత్యక్ష సమావేశం

హైదరాబాద్‌/సంగారెడ్డి అర్బన్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 17 నెలలుగా వేచి చూసినా ఫలితం లేదని, ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాఽధాకరమని పేర్కొం ది. ‘పెండింగ్‌లో ఉన్న రూ.9 వేల కోట్ల బిల్లులు వెంట నే చెల్లించాలి. ఐదు కరువు భత్యాలు తక్షణమే విడుదల చేయాలి. సీసీఎ్‌సను రద్దు చేయాలి. 51ు ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలి. గచ్చిబౌలిలోని స్థలాలను భాగ్యనగర్‌ టీఎన్జీవోలకు కేటాయించాలి’ తదితర డిమాండ్లు ప్రధానంగా జేఏసీ తెలిపింది. జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను ఏర్పాటు చేసి జాప్యం లేకుండా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం నుంచి హామీలే తప్ప ఇచ్చిన మాట నెరవేరడం లేదని, అందుకే శనివారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ రావు పేర్కొన్నారు.


ఉద్యోగుల ఓపిక, సహనాన్ని పరీక్షించొద్దు

ప్రభుత్వ ఉద్యోగుల ఓపిక, సహనాన్ని పరీక్షించొద్దని, చేతగాని తనంగా భావిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌, కార్యదర్శి ముజీబ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంగారెడ్డిలో టీఎన్‌జీవో్‌స ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల వేడుక కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై సబ్‌కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చి నెల గడుస్తున్నా ఇప్పటివరకు జేఏసీ చైర్మన్‌ను చర్చలకు పిలవకపోవడం సరికాదన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 05:08 AM