Telangana Formation Day: ఘనంగా ఆవిర్భావ వేడుకలు
ABN , Publish Date - May 28 , 2025 | 04:18 AM
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నాయి. కేటీఆర్ బీఆర్‌ఎస్ శ్రేణులకు పెద్దఎత్తున సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
విదేశీ పర్యటనకు వెళ్లిన మాజీ మంత్రి
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయాలతోపాటు నియోజకవర్గాలు, పట్టణాలు, మండలాల్లో జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగురవేసి పెద్దఎత్తున సంబరాలు నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ మృతి పట్ల కేటీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లండన్, అమెరికాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేటీఆర్ మంగళవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.