Share News

Telangana Congres: 15 కల్లా డీసీసీల ఏర్పాటు

ABN , Publish Date - Jul 09 , 2025 | 04:05 AM

ఈ నెల 15వ తేదీ కల్లా జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు డీసీసీలు ఏర్పాటు చేస్తామని, ఆ వెంటనే డీసీసీ అధ్యక్షుల నియామకం చేపడతామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ వెల్లడించారు.

Telangana Congres: 15 కల్లా డీసీసీల ఏర్పాటు

  • స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌పై న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం

  • జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌‌దే విజయం

  • కేసీఆర్‌ హయాంలోలా ప్రజాపాలనలో నిర్బంధాలు లేవు: మహేష్‌ గౌడ్‌

హైదరాబాద్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఈ నెల 15వ తేదీ కల్లా జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు(డీసీసీలు) ఏర్పాటు చేస్తామని, ఆ వెంటనే డీసీసీ అధ్యక్షుల నియామకం చేపడతామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ వెల్లడించారు. డీసీసీల ఏర్పాటు ప్రక్రియలో భాగంగానే సీనియర్‌ నాయకులను జిల్లా ఇన్‌చార్జులుగా నియమించామని, ఏఐసీసీ అబ్జర్వర్లు త్వరలోనే రాష్ట్రానికి వస్తారని ఆయన చెప్పారు. ఈ నెలాఖరు కల్లా అన్ని కమిటీల ఏర్పాటూ పూర్తవుతుందన్నారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచనని, ఈ విషయంలో న్యాయ నిపుణులతో చర్చలు జరుగుతున్నాయ ని చెప్పారు. యూరియా కరువు అంటూ బీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇక, అనిరుద్‌ రెడ్డి, తీన్మార్‌ మల్లన్న అంశాలు వేర్వేరని మహేష్‌ గౌడ్‌ పేర్కొన్నారు. అనిరుద్‌రెడ్డి వ్యాఖ్యలను క్రమశిక్షణా చర్యల కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. కులగణన పత్రాలను తగలబెట్టిన తీన్మార్‌ మల్లన్నపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతూనే ఉందని తెలిపారు. మంత్రి పదవుల అంశం తన పరిధిలో లేదని, రాజకీయాల్లో ఒక్కోసారి జూనియర్లకు ముందుగా అవకాశాలు వస్తాయని, సీనియర్లను కూడా పార్టీ గుర్తిస్తుందన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నుంచి పది మంది అభ్యర్థులు సిద్ధంగా ఉండగా వేరే పార్టీల నుంచి అభ్యర్థిని ఎందుకు తీసుకుంటామని అడిగారు. కేసీఆర్‌ హయాంలో నిర్బంధ పాలన జరిగిందని, నెలలో 15 హౌస్‌ అరెస్టులు జరిగేవన్నారు. ప్రజాపాలనలో అలాంటి నిర్బంధాలు లేవని, కేసీఆర్‌ కుమార్తె కవిత ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవడం లేదని గుర్తు చేశారు.


టీపీసీసీ చీఫ్‌తో కోదండరాం భేటీ

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, ఆ పార్టీ నేతలు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ను సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం కలిశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక ఎన్నికల్లో ఇరుపార్టీలూ ఉమ్మడి కార్యాచరణతో పని చేయాలని టీజేఎస్‌ నేతలను మహే్‌షగౌడ్‌ కోరారు.

గాంధీభవన్‌లో వైఎస్‌‌ఆర్‌కు ఘన నివాళి

దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు, మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, శ్రీగణేష్‌, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ కూడా నివాళి అర్పించారు.

Updated Date - Jul 09 , 2025 | 04:05 AM