Share News

Jan Vishwas Bill: జన్‌ విశ్వాస్‌ బిల్లు’పై వివరాలు సేకరిస్తున్నాం

ABN , Publish Date - Aug 12 , 2025 | 05:21 AM

సులభతర వాణిజ్య విధానాన్ని ఈఓడీబీ ప్రోత్సహించడం, చిన్న చిన్న నేరాలకు శిక్షలు తగ్గించడం వంటి లక్ష్యాలతో

Jan Vishwas Bill: జన్‌ విశ్వాస్‌ బిల్లు’పై వివరాలు సేకరిస్తున్నాం

  • కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శికి సీఎస్‌ రామకృష్ణారావు వివరణ

హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): సులభతర వాణిజ్య విధానాన్ని (ఈఓడీబీ) ప్రోత్సహించడం, చిన్న చిన్న నేరాలకు శిక్షలు తగ్గించడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘జన్‌ విశ్వాస్‌ బిల్లు’లో రాష్ట్రం నుంచి చేర్చాల్సిన అంశాల గురించి వివరాలు సేకరిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో సచివాలయం నుంచి పాల్గొన్న సీఎస్‌ రామకృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని వివిధ శాఖల చట్టాల్లో ఉన్న నేర సంబంధ నియమ నిబంధనలను పరిశీలించామని, వీటిని ఆ శాఖలకు పంపించామని కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శికి వివరించారు. వ్యాపారాల వృద్ధి కోసం, ఈఓడీబీని ప్రోత్సహించడంలో భాగంగా దోషులకు శిక్షల తగ్గింపు, వాటి స్థానంలో అపరాధ రుసుముల విధింపు వంటి సరళీకృత ప్రక్రియల అమలుపై ఆ శాఖల నుంచి వివరాలు కోరామని వివరించారు. ఆ వివరాలు రాగానే జన్‌ విశ్వాస్‌ బిల్లులో చేర్చడానికిగాను కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని సీఎస్‌ రామకృష్ణారావు చెప్పారు.

Updated Date - Aug 12 , 2025 | 05:21 AM