Cab Drivers: క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం యాప్ తేవాలి
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:46 AM
క్యాబ్ డ్రైవర్ల కోసం నూతన యాప్ తేవాలని ఊబర్, ఓలా, రాపిడో క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఓలా, ఊబర్, రాపిడో డ్రైవర్ల ధర్నా
చిక్కడపల్లి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): క్యాబ్ డ్రైవర్ల కోసం నూతన యాప్ తేవాలని ఊబర్, ఓలా, రాపిడో క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కిలో మీటరు ప్రయాణానికి కనీస చార్జీ చెల్లించేలా రవాణా శాఖ జీవో ఎంస్ 46ను అమలు చేయాలని కార్మికశాఖ కమిషన్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. తెలంగాణ యాప్ టెస్ట్ డ్రైవర్స్ ఫోరం నేతలు గాజుల కిరణ్, మహేందర్ మాట్లాడుతూ టాక్సీ, ఆటోలకు ఏకరీతిలో చార్జీలను ప్రభుత్వమే నిర్ధారించాలని కోరారు. అగ్రిగేటర్ కంపెనీలు.. నూతన క్యాబ్‌లకు కేటాయింపులు ఆపాలని డిమాండ్ చేశారు.