Share News

Bogatha Waterfall: బొగత వద్ద పర్యాటకుల సందడి

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:28 AM

తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఆదివారం జనసంద్రమైంది. వారాంతపు సెలవు కావడంతో సందర్శకులు భారీగా తరలి వచ్చారు. జలపాతం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది.

Bogatha Waterfall: బొగత వద్ద పర్యాటకుల సందడి

వాజేడు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఆదివారం జనసంద్రమైంది. వారాంతపు సెలవు కావడంతో సందర్శకులు భారీగా తరలి వచ్చారు. జలపాతం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, భద్రాచలం, ములుగు, జనగాం తదితర పట్టణాల నుంచి సందర్శకులు తరలివచ్చి జలపాతం అందాలను వీక్షించి మురిసిపోయారు.


జలపాతం వద్ద ఉన్న ఈత కొలనులో జలకాలాడుతూ సందడి చేశారు. మొత్తం 3 వేల మందికి పైగా సందర్శకులు వచ్చారు. ఈ ఏడాది ఇంత భారీ స్థాయిలో పర్యాటకులు తరలిరావడం ఇదే ప్రథమం. పర్యాటకుల వాహనాలతో పార్కింగ్‌ ప్రదేశం నిండిపోయింది.

Updated Date - Aug 04 , 2025 | 04:28 AM