Share News

Assistant Public Prosecutor: ఏపీపీ పోస్టులకు 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:34 AM

తెలంగాణలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పోస్టుల భర్తీకి ఈనెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Assistant Public Prosecutor: ఏపీపీ పోస్టులకు 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పోస్టుల భర్తీకి ఈనెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొత్తం 118 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 12న ఉదయం 8 గంటల నుంచి అక్టోబరు 5 సాయంత్రం 5 గంటల వరకు ఠీఠీఠీ.్టజఞటఛ.జీుఽలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000 కాగా, ఇతరులకు రూ.2 వేలుగా నిర్ణయించారు.


లీగల్‌ అడ్వైజరీలు, లీగల్‌ కౌన్సిలర్లు, లా ఆఫీసర్ల వంటి వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర పోలీస్‌ నియామక బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. పూర్తి వివరాల అఽధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.

Updated Date - Sep 04 , 2025 | 04:34 AM