Share News

కార్పొరేట్‌ ను తలదన్నేలా బోధన

ABN , Publish Date - Jan 10 , 2025 | 12:32 AM

కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నేలా అడ్మిషన్లు. అంకిత భావవంతో పని చేసే ఉపాధ్యాయులు ఇది కొండమల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల పరిస్థితి . ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధిస్తూ జిల్లాలోనే విద్యార్థుల నమో దులో మొదటి స్థానంలో నిలిచింది . -కొండమల్లేపల్లి,(ఆంధ్రజ్యోతి)

 కార్పొరేట్‌ ను తలదన్నేలా బోధన

కొండమల్లేపల్లి మేజర్‌ గ్రామపంచాయతీగానే కా కుండా విద్యాబోధనలోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. కార్పొ రేట్‌ స్థాయిలో అడ్మిషన్లు నమోదవుతున్న ఈ పాఠ శాలలో అదే స్థాయిలో ఆకట్టుకునే డిజిటల్‌ బోధన జరు గుతోంది. ఇక్కడి పాఠశాలలో అడ్మిషన్లకు పోటీ ఉం దంటే అతిశయోక్తి కాదు. జిల్లాలోనే అత్యధికంగా 955 మంది విద్యార్థులు నమోదై ఉండగా, ఈ పాఠశాలలో 54 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.

ఆకట్టుకునే డిజిటల్‌ తరగతులు

విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే రీతిలో డిజిటల్‌ విద్యా బోధన కొనసాగుతోంది. ప్రతి సంవ త్సరం అంతేకాకుండా అడ్మిషన్ల కోసం తీవ్ర పోటీ ఉండడంతో తరగతులు సెక్షన్లుగా విభజించి విద్యా బోధన కొనసాగిస్తు న్నారు. అలాగే. ఈ ఏడాది 30 మంది స్కౌట్‌ కింద ఎంపికై జిల్లా స్థాయి లో శిక్షణకు ఎంపికయ్యారు.

పదిపై స్పెషల్‌ ఫోకస్‌

ఈ విద్యా సంవత్సరం 212 మంది పదో తరగతిలో విద్య నభ్యసిస్తున్నారు. వీరిలో బాలురు 132, బాలికలు 80 మంది ఉన్నారు. ఉత్తమ ఫలితాల సాధన కోసం ఉద యం, సాయంత్రం సబ్జెక్టుల వారిగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉత్తమ ఫలితాల సాధనకు శ్రమిస్తున్నారు.

వివిధ విభాగాల్లో ప్రతిభ

పాఠశాల నుంచి విద్యార్థులు సామాజిక కార్యక్ర మాల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నారు. అలాగే చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌, సైన్స్‌ ఫెయిర్‌ అలాంటి అంశాల్లో నిర్వి హించే పోటల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ కన బరుస్తూ అబ్బురపరుస్తున్నారు. చెకుముకి పోటీల్లో మాదక ద్రవ్యాల అంశంపై పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని బొడ్డుపల్లి స్పందన జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. తాజాగా సైన్స్‌ ఫెయిర్‌ పోటీల్లో సేంద్రియ ఎరువులు అంశంపై విద్యార్థి భూతరాజు సాయి వర్షిత్‌ రాష్ట్ర స్థాయికి ఎంపిక య్యాడు.

గణితంపై ప్రత్యేక తరగతులు

గణితం అంటే భయం పొగొట్టేందుకు పాఠశాల గణిత విభాగం ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నా రు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వ హిస్తూ విద్యార్థుల గణిత సందేహాలను నివృతి చేస్తు నా ట్నరు. పాఠశాల విద్యార్థులను ట్రిపుల్‌ ఐటీ, పాలిటెక్నిక్‌ కళాశాలలకు ఎంపికయ్యేలా తీర్చి దిద్దుతున్నారు.

దాతల సహకారంతో అదనపు హంగులు

పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వస తులు కల్పనకు దాతల సహకారం తీసుకుంటున్నారు. మాజీ ఎంపీపీ దూదిపాల రేఖాశ్రీధర్‌రెడ్డి పాఠశాలలో సీ సీ కెమెరాలు, బెంచీలు, ఫర్నిచర్‌, కుర్చిలు, టేబుళ్లు, విద్యు దీకరణ, పాఠశాల భవనానికి రంగులు వేయిం చడంతో పాటు పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందిం చడంతో పాటు కొత్త భవన నిర్మాణానికి సహకారం అం దించారు. ఈ విద్యా సంవత్సరం రూ.5 లక్షలు విలు వైన టై, షూ, బ్యాడ్జిలు, ఐడీ కార్డులు, కంప్యూటర్‌, ప్రింట టర్ల ను అందజేశారు. ఇటీవల కొండ మల్లేపల్లికి చెందిన డాక్ట ర్‌ వేదం ఆంజనేయు శాస్త్రీ తన భార్య వేదం లక్ష్మి జ్ఞాపకార్థంగా పాఠశాల పేరిట రూ.లక్ష ఫిక్స్‌డ్‌ డిపాజి ట్‌ చేశారు. దీనిపై వచ్చే వడ్డీని పాఠశాలలో 9వ తరగతి లో ఉత్తమమార్కులుసాధించిన వారికి బహుమతులు అందించేందుకు వెచ్చించనున్నారు.

Updated Date - Jan 10 , 2025 | 12:32 AM