Share News

Jagga Reddy: జగ్గారెడ్డి... ఎ వార్‌ ఆఫ్‌ లవ్‌!

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:16 AM

రాజకీయ రంగంలో రాణించిన తూర్పు జగ్గారెడ్డి.. సినీ రంగంలోనూ ఆరంగేట్రం చేస్తున్నారు. ‘జగ్గారెడ్డి.. ఎ వార్‌ ఆఫ్‌ లవ్‌’ అనే సినిమాలో.. తన నిజ జీవిత పాత్రనే పోషించనున్నారు. జగ్గారెడ్డి తొలి సినిమానే పాన్‌ ఇండియా రేంజ్‌లో నిర్మాణం కాబోతోంది.

Jagga Reddy: జగ్గారెడ్డి... ఎ వార్‌ ఆఫ్‌ లవ్‌!

  • పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా నిర్మాణం

  • అందులో నా నిజ జీవిత పాత్రనే పోషిస్తున్నా

  • వచ్చే ఏడాది ఉగాదికి సినిమా విడుదల: తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రాజకీయ రంగంలో రాణించిన తూర్పు జగ్గారెడ్డి.. సినీ రంగంలోనూ ఆరంగేట్రం చేస్తున్నారు. ‘జగ్గారెడ్డి.. ఎ వార్‌ ఆఫ్‌ లవ్‌’ అనే సినిమాలో.. తన నిజ జీవిత పాత్రనే పోషించనున్నారు. జగ్గారెడ్డి తొలి సినిమానే పాన్‌ ఇండియా రేంజ్‌లో నిర్మాణం కాబోతోంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న సినిమాకు సంబంధించి కథను ఈ ఉగాది పర్వదినం రోజున వింటానని, వచ్చే ఏడాది ఉగాది కల్లా సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తామని చెప్పారు. ఈ మేరకు సోమవారం ‘ఆంధ్రజ్యోతి’కి ఆయన వివరాలను వెల్లడించారు.


ఈ సినిమాను ప్రేమకథగా తీస్తున్నామని, ఆ కథలో ఒక ప్రత్యేక పాత్రను తాను పోషించనున్నానని తెలిపారు. సినిమాలోని ఈ పాత్ర.. నిజ జీవితంలో తన క్యారెక్టర్‌కు అద్దం పట్టనుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ అనుమతితోనే సినిమాలో నటిస్తానని చెప్పారు. ఓ వ్యక్తి కలిసి తన ఒరిజినల్‌ క్యారెక్టర్‌కు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందని చెప్పారని, ఆ పాత్రలో తానే నటించాలని కోరారని వెల్లడించారు. మధ్యలో విరామానికి ముందు మొదలయ్యే తన పాత్ర.. సినిమా చివరి దాకా ఉంటుందన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 04:16 AM