Suryapet WhatsApp Incident: దారుణం.. వాట్సాప్‌లో ఎమోజీ పెట్టినందుకు హత్య..
ABN , Publish Date - Jul 22 , 2025 | 06:40 PM
సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. వాట్సాప్‌లో ఎమోజీ పెట్టినందుకు వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అసలేం జరిగిందంటే..
సూర్యాపేట: జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. వాట్సాప్‌లో ఎమోజీ పెట్టినందుకు వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వచ్చే నెల ఆగస్టు 3న జిల్లాలో పద్మశాలి కులసంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శ్రీరాముల రాములు, ఎలగందుల సుదర్శన్ అనే వ్యక్తుల మధ్య పోటీ జరుగనుంది.
ఈ ఎన్నికల నేపధ్యంలోనే గత అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా శ్రీరాముల రాములు వాట్సాప్‌లో పోస్టులు పెట్టారు. అయితే, అప్పం శ్రీనివాస్‌కు మద్దతుగా మానుపూరి కృపాకర్ అనే వ్యక్తి ఎమోజీతో ఆ పోస్టుకు రిప్లై ఇచ్చారు. దీంతో మానుపూరి కృపాకర్‌పై శ్రీరాముల రాములు వర్గం దాడి చేసింది. ఈ దాడిలో మానుపూరి కృపాకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.