ఎద్దుల పందేల్లో సూర్యాపేటకు జిల్లాకు ప్రథమ బహుమతి
ABN , Publish Date - Jan 18 , 2025 | 01:09 AM
హుజూర్‌నగర్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన మాజీ పోలీస్ అధికారి సుంకి సురేందర్‌రెడ్డికి చెందిన ఒంగోలు జాతి గిత్తలు ప్రథమ బహుమతి సాధించాయి.

హుజూర్‌నగర్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన మాజీ పోలీస్ అధికారి సుంకి సురేందర్‌రెడ్డికి చెందిన ఒంగోలు జాతి గిత్తలు ప్రథమ బహుమతి సాధించాయి. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాలోని పొద్దుటూరులో గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల స్థాయి సీనియర్ ఎద్దుల పందేలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సురేందర్‌రెడ్డికి చెందిన గిత్తలు 25 నిమిషాల్లో3,644 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం సాధించాయి. దాం తో నిర్వాహకులు మొదటి బహుమతి కింద సురేందర్‌రెడ్డికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాజీ పోలీస్ అధి కారి సురేందర్‌రెడ్డిని అభినందించారు. ప్రతియేటా రాష్ట్ర స్థాయి పోటీల్లో మొ దటి బహుమతి సాధించడం ఈ ప్రాంతానికి ఎంతో గర్వ కారణమన్నారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ అనేక ఏళ్లుగా ఒంగోలు జాతి గిత్తలను పెంచుతున్నట్లు తెలిపారు. తనకు వ్యవసాయమన్నా, ఎద్దుల పోటీలన్నా ఎంతో మక్కువ అన్నారు.