Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహ అంచనా పరీక్షలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:11 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద శుక్రవారం నీటి ప్రవాహ తీవ్రతను అంచనా వేసే ఏడీసీపీ(అకోస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్) సర్వే నిర్వహించారు.
మహదేవపూర్ రూరల్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద శుక్రవారం నీటి ప్రవాహ తీవ్రతను అంచనా వేసే ఏడీసీపీ(అకోస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్) సర్వే నిర్వహించారు. పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్(సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) సైంటిస్టు నాగరాజ్ బృందం ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టారు.
మేడిగడ్డ్డ బ్యారేజీని సముద్రమట్టానికి 88 మీటర్ల ఎత్తులో నిర్మించగా బ్యారేజీ పూర్తిస్థాయిలో వరద ప్రవాహం ఉన్నప్పుడు ఆ తీవ్రత ఎలా ఉంటుందో గుర్తించడానికి ఈ సర్వే నిర్వహించినట్లు వారు తెలిపారు. బ్యారేజీ ‘ఫుల్ రిజర్వాయర్ లెవల్’ 100 మీటర్లు కాగా శుక్రవారం 97.30 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండడంతో ఈ పరీక్షలు చేపట్టినట్లు పేర్కొన్నారు.