Defection MLAs Case: పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం కోర్టులో 14న విచారణ..
ABN , Publish Date - Nov 10 , 2025 | 10:48 AM
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది. అక్టోబర్ 31వ తేదీతో 3 నెలల గడువు ముగిసింది.
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన తెలంగాణ ఎమ్మెల్యేల కేసుపై విచారణకు మరింత సమయం కావాలని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును గడువు కోరిన సంగతి తెలిసిందే. గత నెల 25వ తేదీన తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై నవంబర్ 14వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది. అక్టోబర్ 31వ తేదీతో 3 నెలల గడువు ముగిసింది. అయితే, స్పీకర్ కార్యాలయం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి వివరణలు, విచారణలు కొనసాగిస్తుండటంతో గడువు కావాలంటూ గడువు పూర్తవ్వటానికి ముందే సుప్రీంకోర్టులో ఫిటిషన్ ఫైల్ చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కేసును విచారించే అవకాశం ఉంది. నవంబర్ 14వ తేదికి ఈ కేసు లిస్ట్ అయింది. స్పీకర్ కార్యాలయం అడిగిన విధంగా సుప్రీంకోర్టు మరింత సమయాన్ని ఇస్తుందా.. గడువు సమయంలోగా అనర్హతపై నిర్ణయం తీసుకోనందుకు మందలిస్తుందా అన్నది నవంబర్ 14వ తేదీన తెలియనుంది.
ఇవి కూడా చదవండి
బంగారం ధరలకు రెక్కలు.. హైదరాబాద్‌లో పది గ్రాముల ధర ఎంతంటే..
అందెశ్రీ మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి